అస్సాంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో 200లకు పైగా ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటన కార్బీ అంగ్లాంగ్ జిల్లాలో ఈరోజు (బుధవారం) జరిగింది. దిమాపూర్, బోకాజాంగ్ జిల్లాల నుంచి అగ్నిమాపక యంత్రాలు వచ్చి మంటలను అదుపు చేస్తున్నాయని అధికారులు తెలిపారు. ఇంట్లోని గ్యాస్ సిలిండర్లు పేలి మంటలు చెలరేగాయని, సైకిళ్లు, కార్లు కూడా మంటల్లో కాలిపోయాయని స్థానికులు తెలిపారు. మంటల్లో ఇంట్లోని నగదు, ఆహారం, దుస్తులు, ఇతర విలువైన పత్రాలు దగ్ధమైనట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో ఎంతమేర నష్టం వాటిల్లిందనేది అంచనా వేయలేమని అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదంపై పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు.
The post అస్సాంలో అగ్నిప్రమాదం: 200కు పైగా ఇళ్లు దగ్ధం appeared first on T News Telugu.