
హైదరాబాద్: సీఎం కేసీఆర్ హయాంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు మరింత మేలు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అభివృద్ధి ప్రణాళికను ప్రజలకు వివరించేందుకు, పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశంతో వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల ఎమ్మెల్యేలతో పర్వతగిరిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాజకీయ పార్టీల బూత్ కమిటీలు, పెండింగ్ పింఛన్లు, పట్టణాభివృద్ధి అంశాలపై నియోజకవర్గాల వారీగా పరిశీలన చేస్తున్నారు. సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నన్నపనేని నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
855287