హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కి నిధులు కేటాయించాలని పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి లేఖ రాశారు. 31 కిలోమీటర్ల మేర మెట్రో ప్రాజెక్టు రెండో దశ నిర్మాణానికి రూ.84.53 బిలియన్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకాపూల్, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో పనులు సాగుతాయని చెప్పారు. హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మెట్రో ప్రాజెక్టును మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు.