ఐఏఎస్ అధికారుల బదిలీ |తెలంగాణకు ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ కలెక్టర్ గా బి గోపి, కరీంనగర్ అదనపు కలెక్టర్ గా ప్రఫుల్ దేశాయ్ నియమితులయ్యారు.
ఐఏఎస్ అధికారుల బదిలీ |తెలంగాణకు ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ కలెక్టర్ గా బి గోపి, కరీంనగర్ అదనపు కలెక్టర్ గా ప్రఫుల్ దేశాయ్ నియమితులయ్యారు. నల్గొండ కలెక్టర్‌గా ఆర్వీ కర్ణన్, జీహెచ్‌ఎంసీ అదనపు కలెక్టర్‌గా వెంకటేశ్ దోత్రే, సూర్యాపేట అదనపు కలెక్టర్‌గా చెక్కా ప్రియాంక, ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్‌గా హేమంత కేశవ్ పాటిల్ బదిలీ అయ్యారు. పెద్దపల్లి అదనపు కలెక్టర్‌గా జే అరుణశ్రీని, మెదక్ జిల్లాకు అదనపు కలెక్టర్‌గా జి రమేష్‌లను నియమించారు. ప్రస్తుతం నల్గొండ కలెక్టర్‌గా పనిచేస్తున్న టి వినయ్‌కృష్ణారెడ్డిని సాధారణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు నివేదించాలని ప్రభుత్వం ఆదేశించింది.