అమెరికాలోని అట్లాంటాలోని ఓ అపార్ట్మెంట్లో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. చాలా మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
సోషల్ మీడియాలో మొదలైన వాగ్వాదం ఇద్దరు యువకుల మరణానికి దారితీసిందని డిప్యూటీ కమిషనర్ చార్లెస్ హాంప్టన్ జూనియర్ తెలిపారు.
శనివారం సాయంత్రం 5 గంటలకు అట్లాంటా అపార్ట్మెంట్కు కొందరు యువకులు తుపాకులు పట్టుకుని వచ్చారని, మరో బృందం వారిని చూసి కాల్పులు జరిపిందని ఆయన చెప్పారు.
ఇరువర్గాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 14, 16 ఏళ్ల ఇద్దరు బాలురు మృతి చెందగా, మరో ఇద్దరు బాలురు, 15 ఏళ్ల బాలిక గాయపడ్డారు.