- మేడే రాజీవ్‌సాగర్ టీఎస్ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్
హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): సౌరశక్తిని సద్వినియోగం చేసుకునేందుకు శ్రీకారం చుట్టిన తెలంగాణ ఫుడ్స్ మరో అడుగు ముందుకేసింది. ఇక నుంచి కంపెనీ కార్యకలాపాలన్నింటినీ డిజిటలైజ్ చేయాలని నిర్ణయించింది. ఫ్యామిలీ సెర్చ్ మరియు సాల్ట్ లేక్ సిటీకి చెందిన కంపెనీ భాగస్వామ్యంతో డిజిటల్ వర్క్స్‌ను అభివృద్ధి చేయనున్నట్లు టీఎస్ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ తెలిపారు. ఫ్యామిలీ సెర్చ్ మరియు సాల్ట్ లేక్ సిటీ ప్రతినిధులతో మంగళవారం ఒక ఒప్పందం కుదిరింది. తెలంగాణ ఫుడ్స్ ఆవిర్భావం నుంచి (1976) ఇప్పటి వరకు ఉన్న అన్ని పత్రాలను డిజిటల్ రూపంలోకి మారుస్తామని మేడే రాజీవ్‌సాగర్ తెలిపారు. ఫ్యామిలీ సెర్చ్ ఏరియా మల్టీ కంట్రీ మేనేజర్ ఎం.సురేష్ రామకృష్ణ, మైనారిటీ కౌన్సిల్ మాజీ వైస్ చైర్మన్ శంకర్లుక్, ఫ్యామిలీ సెర్చ్ ప్రతినిధి మనోహర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించారు.