వర్జీనియా: అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో కాల్పులు జరిగాయి. చీసాపీక్లోని వాల్‌మార్ట్ స్టోర్‌లో ఓ సాయుధుడు కాల్పులు జరిపి పది మందిని హతమార్చినట్లు సమాచారం. వాల్‌మార్ట్‌లో స్టోర్ మేనేజర్‌గా పనిచేస్తున్న వ్యక్తి తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అనంతరం ఆ వ్యక్తి తనను తాను కాల్చుకున్నాడు.
కాల్పులు జరిపిన వ్యక్తి చనిపోయాడని చెసాపీక్ సిటీ పోలీసులు ఒక ట్వీట్లో తెలిపారు. ఈ కాల్పుల్లో దాదాపు పది మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. అయితే దుండగుడు ఎందుకు దాడికి పాల్పడ్డాడనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
851367