వెస్టిండీస్ దిగ్గజ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. బ్రావో ప్రకటన తర్వాత, చెన్నై సూపర్ కింగ్స్‌కు బౌలింగ్ కోచ్‌గా CSK జట్టు అతన్ని ఎంపిక చేసింది. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన డ్వేన్ బ్రేవో గత కొన్నేళ్లుగా చెన్నై తరఫున ఆడుతూ ఎన్నో విజయాలను అందుకున్నాడు. బ్రావో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టాడు.
చెన్నై సూపర్ కింగ్స్ తన అధికారిక వెబ్సైట్ ద్వారా బ్రావోను బౌలింగ్ కోచ్‌గా నియమించినట్లు ప్రకటించింది. లక్ష్మీపతి బాలాజీ వ్యక్తిగత కారణాలతో ఏడాది పాటు కోచ్‌ను వదిలివేయనుండగా, అతని స్థానంలో బ్రావో తమ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.