- బీజేపీ పెద్దలే సూత్రధారులు
- తెరపైకి షా, బీఎల్ సంతోష్, బన్సల్ పేర్లు
- తెలంగాణపై బీజేపీ గద్దల విష పన్నాగం
- వందల కోట్లతో ఎమ్మెల్యేల కొనుగోలుకు రెడీ.. తెరవెనుక ‘నంబర్ 1, నంబర్ 2’
- బీఎల్ సంతోష్ ప్రత్యక్ష పర్యవేక్షణ.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.100 కోట్ల ఆఫర్
- రోహిత్ రెడ్డితో స్వామి సంభాషణలో వెల్లడి… ముగ్గురు బ్రోకర్ల మధ్యా మంతనాలు!
- బయటపడ్డ రెండు ఆడియో టేపులు.. దేశవ్యాప్తంగా పెను సంచలనం
కమల్ ఫైల్స్ – 2
- సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎంతైనా ఇచ్చేందుకు సిద్ధం
- నలుగురొస్తే నెలరోజుల్లో ప్రభుత్వాన్ని కూల్చేస్తాం
- 20-30 మందినైనా కొనడానికి సిద్ధంగా ఉన్నాం
- కొనుగోళ్లను బీఎల్ సంతోష్, షా చూసుకుంటారు
- చేరినవాళ్లకు కేంద్రం వై ప్లస్ క్యాటగిరీ భద్రత
- ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చేందుకూ ఆపరేషన్
- బీజేపీతో టచ్‌లో 43 మంది ఆప్ ఎమ్మెల్యేలు
- సింహయాజి, నందు, రామచంద్ర సంభాషణ
టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో బీజేపీ ఏజెంట్లు… రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజిల సంభాషణ..
నందు: మరో నలుగురితో బీజేపీలో చేరేందుకు పైలట్ సిద్ధంగా ఉన్నాడు . పైలట్‌కి ఒక రేటు, మిగతా వారికి మరొక రేటు. పోలింగ్‌కు ముందు చేరితే రూ. 100 కోట్లు.
రామచంద్ర భారతి: బండి సంజయ్ మరియు కిషన్‌రెడ్డిలకు అంత ప్రాముఖ్యత లేదు. నేరుగా కేంద్రంతోనే
ఒప్పందాలు. గుజరాత్ ఎన్నికలకు ముందు మనం ఇంత రిస్క్ చేస్తున్నాం
నందు: ముగ్గురు రోహిత్‌తో రావడానికి సిద్ధంగా ఉన్నారు.
రామచంద్ర భారతి: మీరు రోహిత్ సహచరుల పేర్లు చెబితే, నేను బీఎల్ సంతోష్‌తో మాట్లాడతాను. హైదరాబాద్ రావాలని అడిగితే ఎంత మంది పార్టీలో చేరుతారని బీఎల్ సంతోష్ ప్రశ్నించారు.
నందు: చేవెళ్ల, పరిగి, తాండూరు వెళతాం.
రామచంద్ర భారతి: ఎమ్మెల్యేల కొనుగోళ్లను బీఎల్ సంతోష్ జీ, అమిత్ షా చూసుకుంటున్నారు. పెద్దఎత్తున
ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. ఒకరికొకరు సమయం వృధా చేసుకోకండి. మనం ముందుగా మన ఆపరేషన్ చేస్తే చాలా ప్రభావం ఉంటుంది. ముందుగా నలుగురు వస్తారని, తర్వాత 10 మంది వస్తారని నందు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేలు ఇతరుల పేర్లతో సిమ్ల ద్వారా మాట్లాడాలి, అదే నేను చేస్తున్నాను.
నందు: చెల్లింపు విషయంలో ఎలాంటి సమస్య లేదని రామచంద్ర భారతి హామీ ఇచ్చారు. తుషార్‌ను తీసుకువస్తారా ?
రామచంద్ర భారతి: తుషార్‌ను కలవడానికి ఎమ్మెల్యేలకు ఇబ్బంది లేదా?
నందు: తుషార్‌తో మాట్లాడటానికి ఎమ్మెల్యేలకు ఎలాంటి ఇబ్బంది లేదు
రామచంద్ర భారతి: నం.1, నం. 2కి సంబంధించిన వ్యక్తి తుషార్‌ను తీసుకున్నాడు. బీఎల్ సంతోష్ సాధారణ వ్యక్తి కాదు. రోహిత్ రాజీనామా చేసిన నెలరోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం పడిపోతుంది. నలుగురు ఎమ్మెల్యేలు వస్తే రాష్ట్ర ప్రభుత్వం రద్దు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు వస్తే ఎంతయినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. కాసేపు కూర్చున్నాక మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలను ముట్టుకుందాం. ఆపరేషన్ ఢిల్లీ కూడా నడుస్తున్నది. 43 మంది ఆప్ ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పటికీ ఎమ్మెల్యే సభ్యత్వం కోల్పోరు. త్వరలో నందుని పార్టీలోకి తీసుకుని నామినేటెడ్ పదవి ఇద్దాం. మాకు సహకరించిన వారికి కేంద్ర భద్రత కల్పిస్తాం.
నందు: వారితో నిన్న ఉదయం కలిశారా?
రామచంద్రభారతి: అవునా.
నందు: వారిని ఒప్పించాను. వారు చాలా వరకు ఒప్పుకున్నారు.
రామచంద్రభారతి: ఎవరిని.
నందు: పైలట్
రామచంద్రభారతి: సరే
నందు: ముందు చూద్దాం అని చెప్పండి, తరువాత సరే అనండి, ఆ తరువాత అంతా సరిగ్గానే ఉందని చెప్పాను. మళ్లీ రాత్రికి వీడియో కాల్‌తో మాట్లాడాను. మళ్లీ ఇవ్వాళ ఉదయం ఇంటికి వచ్చారు. ఇద్దరు కలిసి వచ్చారు. వారికి నేను విషయం నచ్చజెప్పాను. మీరు అదీ ఇదీ అని చెడగట్టుకోవద్దని అన్నాను. ఏది కావాలంటే అది ఇప్పిస్తా అన్నాను. నువ్వే టీం లీడరుగా ఉంటావని కూడా చెప్పాను. నువ్వు ముందొస్తే నువ్వే గ్రూపు నాయకుడివి అవుతావు అని చెప్పాను. అలాంటి కబుర్లు చెబితేనే ఆయన ఒప్పుకున్నాడు. నాకు వేరే రేట్ ఇప్పించండి. నేను అన్నీ చేసి పెడతాను.
రామచంద్రభారతి: ఆయనకు ఎంత అంటున్నాడు..
నందు: ఆయన వంద రూపాయలు ఆశిస్తున్నాడు..
రామచంద్రభారతి: వంద రూపాయలు ఆశిస్తున్నాడా? సరే.. ఆయన వెంట ఎంతమంది ఉన్నారు?
నందు: నలుగురు. ఆయనతో కలిపి నలుగురు.
రామచంద్రభారతి: ఆయనతో కలిపా? అందరికి కలిపి ఎంతివ్వాలి?
నందు: ఉజ్జాయింపుగా…
రామచంద్రభారతి : ఊ,,,
నందు: ఈ విషయాలన్నీ నువ్వొచ్చినప్పుడు మాట్లాడుదాం..కానీ వారొస్తారా?
రామచంద్రభారతి : ఇవన్నీ నేను సంతోష్‌కి చప్పాల్సి ఉంటుంది. వారేం ఆశిస్తున్నారో..అన్నీ చెప్పాల్సి ఉంటుంది.
నందు: ఆయనే లీడ్ చేస్తాడు.. ఆయనే
రామచంద్రభారతి: నేను పైలట్ ముఖ్యుడని నేను చెప్తాను. నలుగురు.. ఆయన రావడానికి రడీగా ఉన్నాడని చెబుతా…
నందు: అతనితో స్వామీజీ కూడా..
రామచంద్రభారతి: నన్ను ముందు చెప్పనీ… పూర్తి చెయ్యనీ.. పైలట్‌తో నలుగురు వస్తారని ప్లాన్ చేస్తున్నానని చెబుతాను. పద్ధతి గురించి కూడా చెబుతాను. మనం ఇంకా ఏం చేయాలి.
నందు: సరే..
రామచంద్రభారతి: దీనికోసం నేను ఒక సలహా ఇస్తాను. ఇంకా చాలమంది తయారుగా ఉన్నారు. ముందుకు
నడిపించండి.
నందు: సరే. స్వామీగౌడ్ కూడా ఇదే చెబుతున్నాడు. అతను పార్టీని వదిలాడు. అతను టీఆర్ఎస్లో జాయిన్
అయినట్లు చెప్పాడు.
రామచంద్రభారతి : టీఆర్ఎస్ లోకా….
నందు: ఇద్దరు పెద్దవాళ్లతో కలిసి..
రామచంద్రభారతి: అది నాకు కూడా తెలుసు..
నందు: స్వామీ గౌడ్…మరియు.. ఇంకొక మనిషి భిక్షమయ్య గౌడ్..
రామచంద్రభారతి: అలాగా.. వారిప్పటికే జాయిన్ అయినారా..
నందు: అవును… వారు చాలా రోజులనుంచి అంటున్నారు.. నేను మీకు ముందే చెప్పాను కదా…
రామచంద్రభారతి: వాళ్లు అంటున్నారన్నావు…. కానీ.. వారు ఎందుకు పోయారు?
నందు: ఇక్కడ ఆర్గనైజేషన్ సరిగ్గా లేదు స్వామీజీ.. మీరు అర్ధం చేసుకోండి.. వాళ్లకు మీరు నచ్చజెప్పండి..
రామచంద్రభారతి : అది కాదు.. అర్ధం చేసుకోండి. ఏ సమస్య అయినా…
నందు: హా..స్వామీజీ చెప్పండి..
రామచంద్రభారతి : ఏ సమస్య ఉన్నా మా దగ్గరికి వస్తారు. తరువాత చక్కదిద్దేది మేమే …
నందు: ఈ పైలట్ అమెరికా నుంచి వచ్చాడు కదా.. తెలివైన వాడు. ఇతను సమర్ధుడే..
రామచంద్రభారతి : నేను ఎవరి ముందు కూర్చొని మట్లాడుతున్నానో …నీకు తెలుసా..
నందు: అర్ధం అయింది స్వామీజీ… అందుకే మీకు ఫోన్ చేశా…
రామచంద్రభారతి : చూడండి. నాకు అక్కడ ఉండే టైం లేదు.. చిన్న విషయాలకు నాకు అంత టైం ఉండదు. వస్తే ఒప్పుకుంటే .. ఒప్పుకున్న ప్రకారం పని పూర్తి చేస్తాం. కాని అది వారి చేతిలోనే ఉంది. అది బండీ సంజయ్ చేతిలో కానీ ఇంకెవరి చేతిలో లేదు.
నందు: నా సలహా ఏందంటే..
రామచంద్రభారతి : చెప్పండి..
నందు: ఢిల్లీలో మనమేం చేస్తున్నామో ఇక్కడ తెలవద్దు స్వామీజీ…
రామచంద్రభారతి : అవును. రాష్ట్రంలో తెలియకుండానే , ఇక్కడివాళ్లని బైపాస్ చేసి కేంద్రంలోని వాళ్లతోనే
హ్యాండిల్ చేస్తున్నాము కదా.
నందు: అవును స్వామీజీ.. ఒకసారి పూర్తయితే..ఒక ఝట్కా తలుగుతుంది. అప్పుడు మీరన్నట్లు జరుగుతుంది. అదంతా మునుగోడు ఎన్నికలకంటే ముందే.. నేను ఆ కండిషన్ పెట్టాను. మునుగోడు ఎన్నికల తరువాత అవకాశము ఉండదని చెప్పాను.
రామచంద్రభారతి : సరే. వాళ్ళు 100 కు తయారైతే మేం రెడీనే…
నందు: సరే…పక్కా… పక్కా…స్వామీజీ
రామచంద్రభారతి : పక్కా కాక పోతే నేను…
నందు: కాదు స్వామీజీ.. అందుకే నేను మీతో మాట్లాడుతున్నాను. మీతో తరువాత మాట్లాడాలంటే ఎలా?
వాట్సప్‌తో మాట్లాడ వచ్చా? మీ దగ్గర ఉంటేనే.. నాకు స్వామీజీ( మీ) పై పూర్తి నమ్మకం ఉంది.
రామచంద్రభారతి : స్వామీజీకి నీపై విశ్వాసముంది. నాపైన నీకైతే విశ్వాసం ఉంది.. నువ్వొకసారి మాట్లాడి స్పష్టమైన హామీ తీసుకుంటే సరిపోతుంది. అప్పుడు మాతో ఇంటరాక్షన్ అవసరం లేదు. మేం నేరుగా వారితోనే కలుస్తాం.
నందు: ఈ విషయం వారితో చెబితే వారికీ సంతృప్తి కలుగుతుంది. మొదటిసారితోనే కాన్ఫరెన్సు అయిపోతుందా?
రామచంద్రభారతి : అయిపోతుంది. అలా కాదంటే ఇవ్వళ ఒక్కరోజు వదిలెయ్. ఒక్కసారి వాళ్లతో మాట్లాడు. నేను రేప్పొద్దున సంతోష్‌కు మెసేజ్ పెడతాను. ఎందుకంటే తుషార్ 10 రోజుల నుంచి ఎదురుచూసి వెళ్ళిపోయాడు.
నందు: ఎలాగైనా…చేయించండి స్వామీజీ.
రామచంద్రభారతి : రాత్రికి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఒక్క పనికోసం ఒకే చోట ఉండరు. గుజరాత్ ఎలక్షన్ కోసం వెళ్ళారు. నేనే ఆయనని పిలిచాను. అందుకే వచ్చారు.. ఎంతమంది ఉన్నారో చెప్పండి. తుషార్‌కి చెబుతాను..
నందు: మొత్తం నలుగురు.
రామచంద్రభారతి : సరే నలుగురితో కలిపిస్తావా.
నందు: మీతో మాట్లాడింతరువాత చెబుతా అని చెప్పాను.
రామచంద్రభారతి : సరే సరే.
నందు: అది వాళ్ల తల నొప్పి .
రామచంద్రభారతి : అందుకే వాళ్ల పేర్లు అడుగుతున్నాను. వారి పేర్లు అక్కడ చెప్పాలి. డీల్ పూర్తి చేస్తా. సంతోష్ కూడా మాట్లాడి సెట్ చేస్తాడు.
నందు: సరే…
రామచంద్రభారతి : పేర్లు ఇంపార్టెంట్ మాట్లాడం కాదు. పక్కా పని కావాలి
నందు: స్వామీజీ నేను రేపు చెబుతాను..
రామచంద్రభారతి : నాతో ఒక్కసారి కల్పిస్తే వాళ్లకు చెబుతాను. పై వాళ్లతో ఎలా మాట్లాడతా నందూజీ… నాతో వాట్సప్ లో కాన్ఫరెన్సు మాట్లాడించండి..
నందు: ఒక్క సెకండ్
రామచంద్రభారతి : స్వామీజీ నమస్తే… ఇంకా లేవలేదా..
సింహయాజి: స్టింగ్ ఆపరేషన్ కోసం చేవెళ్ల పోతున్నాను. తరువాత పరిగి వెళుతున్నాను.
రామచంద్రభారతి : సరే..
సింహయాజి: అక్కడినుంచి కొడంగల్, తరువాత తాండూర్ నల్గురు ఎమ్మెల్యే కలుస్తున్నారు.
రామచంద్రభారతి: తాండూర్ రోహిత్‌రెడ్డి.
నందు: 100 కిమీ. లో 5 గురిని కొనవచ్చు
రామచంద్రభారతి : సరే
నందు: పరిగి 100 కి.మీ. , కొడంగల్ 120 కి.మీ.
రామచంద్రభారతి : ఓకే. తరువాత సంఖ్య పెరుగుతుంది. సంతోష్‌తో వెంటనే అమిత్‌షాతో కాన్ఫరెన్స్ కాల్. అమిత్ షా ఒకరిద్దరైతే వద్దన్నారు… వాళ్లనే ఢిల్లీకి రమ్మన్నారు.
నందు: సరే.
రామచంద్రభారతి : అయిదారుగురు కంటే ఎక్కువ ఉంటే మాట్లాడదాం..
నందు: స్వామీజీ నేను ఎంత కష్టపడుతున్నానో మీకు తెలుసు..
రామచంద్రభారతి : ఒ.కే. నాకు తెలుసు..
నందు: మునుగోడు ముందే చేద్దామని లక్ష్యం ఉండేది. అలాగైతేనే బాగుంటుంది. మేం ఇంకా ఎక్కువ మందితో మాట్లాడుదామని అనుకున్నా, పొద్దున్నే మాట్లాడాం. ఎంతో రిస్కుతో కూడుకున్నది.
రామచంద్రభారతి : అయితే ఆపేద్దాం. ఇది వర్కవుట్ కాదంటావా. అయితే కేంద్రం ఈ పనిమీదే ఉంది తెలుసా.
నందు: వాళ్ళు పూర్తి సపోర్టు కావాలంటున్నారు. నో డౌట్ సార్. నేను చెప్పాను సర్. ఇండియాలో నంబర్ వన్
అయిన అతనితో మాట్లాడుతున్నామని చెప్పాను సర్.
రామచంద్రభారతి : సంతోష్ చిన్న మనిషి కాదు. చాలా పెద్ద మనిషి. మినిష్టర్లు కూడా ఆయన అపాయిమెంటు కోసం చూస్తారు. అది ఆయన ప్రొటోకాల్
నందు: సరే సర్
రామచంద్రభారతి : అయితే ఆయనను రమ్మని పిలువు. చాలామంది ఉంటేనే నేను మాట్లాడుతా.
నందు: స్వామీజీ.. చాలా మంది ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎమ్మెల్సీలుకూడా ఉన్నారు. నేను ఒకేసారి 10 మందిని డీల్ చేయగలను . సిట్టింగ్ 4 గురు మాత్రమే. వారిపేర్లు మాత్రం లేవు. అందులో ఒక్కరి పేరు రోహిత్.
రామచంద్రభారతి : అయితే వాళ్ళు అమిత్‌షాతో మాత్రమే మాట్లాడతారా?
నందు: అయితే నిన్ననే మాట్లాడాడు. మీటింగ్ అయ్యేదాకా పేర్లు బయట పెట్టనని చెప్పాడు.
రామచంద్రభారతి : నేను అదే చెబుతున్నాను..మీటింగ్ అయ్యేదాక చెప్పడా..
నందు: మీతో మీటింగ్ కూడా మాకు ఇంపార్టెంటే.
రామచంద్రభారతి : అది కరెక్టే.
నందు: అసలు ప్రయాణమే ప్రాజెక్టును నష్టపరుస్తుందేమో. అదొక్కటే సమస్య. లేకపోతే, వాళ్లిక్కడే మాట్లాడేవారు. ఒకేసారి ముగ్గురు, నలుగురు వ్యక్తులు వస్తే బాగుంటుంది. ఇంటెలిజెన్స్ నిఘా గట్టిగా ఉన్నది. వేరే వారి పేరిట ఓ సిమ్ తీసుకొమ్మని ఈ రోజు ఉదయాన్నే అతను చెప్పాడు.
రామచంద్రభారతి: అవును. అది చాలా ముఖ్యం. సొంత నంబర్లో మాట్లాడటం ప్రమాదం. నేను ఈ టెక్నిక్‌నే ఎప్పుడూ పాటిస్తాను
నందు: అవునవును. కొన్ని వాట్సాప్ కాల్స్ కూడా ప్రమాదమే
రామచంద్రభారతి: ఇవన్నీ ఫోన్లో మాట్లాడటం మంచిది కాదు, కాబట్టి, నేను 26 లేదా 27న వస్తా
నందు: ఏంటీ?
రామచంద్రభారతి: వాళ్లంతా సిద్ధం చేశారు. పేమెంట్ గురించి ఎలాంటి సమస్య లేదు
నందు: వాళ్లు ఇంట్రెస్ట్ చూయిస్తున్నారా?
రామచంద్రభారతి: హా. అయితే, అక్కడికి వచ్చాకే, అక్కడే పేమెంట్ అప్రూవ్మెంట్ చేస్తారు. లేకపోతే లేదు
నందు: నేను మాటిస్తున్నా. అంతా బాగానే జరుగుతుంది. అయితే, ఈ మిషన్ విజయవంతమైతే, ప్రభుత్వం
కూలిపోతుందా?
రామచంద్రభారతి: అవును. దానికోసమే కదా నేను చూస్తున్నది. ఇదే విషయాన్ని నంబర్ 2, సంతోష్‌కు
తెలియజేశా. దీనిపై మేము క్షుణ్ణంగా చర్చించాం. ఎక్కువ మొత్తంలో ఎమ్మెల్యేలు వస్తే మంచిదని చెప్పాడు. లేకపోతే, తను కూడా ఏం చేయగలడు?
నందు: మీటింగ్‌కి తుషార్ వస్తారా?
రామచంద్రభారతి: ఇద్దరం వచ్చి డీల్ క్లోజ్ చేస్తాం
నందు: మీరు, తుషార్ వస్తే బాగుంటుంది స్వామీ. మీరిద్దరు వచ్చి ఈ ముగ్గురు, నలుగురితో మాట్లాడండి.
అవసరమైతే, మరో పది మందిని కూడా రెడీ చేస్తా
రామచంద్రభారతి: వాళ్లంతా తుషార్‌తో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారా?
నందు: అవును
రామచంద్రభారతి: ఎందుకు ఇలా అడుగుతున్నానంటే, నంబర్ వన్, నంబర్ టూను వెనుకుండి నడిపించేది తుషారే
నందు: నాకు కూడా తెలుసు స్వామీ
రామచంద్రభారతి: అయితే, మంచిది. ముందు నేను వస్తా. అక్కడ అంతా సక్రమంగా ఉంటే, తుషార్‌కి ఫోన్ చేస్తా. మరుసటి రోజు ఉదయమే తుషార్ హైదరాబాద్‌కు వస్తారు
నందు: అయితే, స్వామి మీరు 26 ఉదయం వస్తారా?
రామచంద్రభారతి: వస్తా
నందు: సరే స్వామి
రామచంద్రభారతి: 27న సంతోష్ అపాయింట్మెంట్ తీసుకొని అక్కడికి వెళ్దాం
నందు: సరే స్వామి
రామచంద్రభారతి: తుషార్ వచ్చి, అందరి ముందే చర్చిస్తాడు
నందు: స్వామీ.. మీరు 30 మంది కావాలన్నా.. నేను రెడీ చేయగలను. అయితే, మీకు ప్రస్తుత పరిస్థితి
అర్థమవుతున్నదా?
రామచంద్రభారతి: నాకు తెలుసు. మెజారిటీతో సుస్థిరంగా ఉన్న ప్రభుత్వాన్ని కూల్చడం అంత తేలిక కాదు
నందు: అయితే, ముగ్గురితో ఎలా?
రామచంద్రభారతి: అది చాలు. ముందుగా రోహిత్ రాజీనామా చేస్తే.. నెలరోజుల్లోగా.. అతను (కేసీఆర్) ప్రభుత్వాన్ని రద్దు చేస్తారు
నందు: ముగ్గురు, నలుగురితో పని అవుతుందా?
రామచంద్రభారతి: నేను చెప్పేది అదే. పార్టీకి రోహిత్ రాజీనామా చేయగానే, ప్రభుత్వం కుప్పకూలుతుంది
నందు: మీరు ఒక్క రోహిత్ గురించే మాట్లాడుతున్నారు. నేను, నలుగురి గురించి మాట్లాడుతున్నా
రామచంద్రభారతి: ఒక్కడు ప్రభుత్వం మొత్తంతో సమానంగా నేను భావిస్తున్నా. తుషార్‌తో మాట్లాడుదాం
నందు: మీరు ఉదయం వస్తారా?
రామచంద్రభారతి: అవును. 26న నేను వస్తా. 27న ఉదయం అమిత్ షా దగ్గరికి వెళ్దాం. ముందుగా నేను
అపాయింట్మెంట్ తీసుకుంటా
నందు: ఇప్పుడు ఎక్స్ట్రా క్యాండిడేట్లు వద్దా?
రామచంద్రభారతి: డీల్ చెయ్యి. అయితే, ముందు కూర్చుందాం
నందు: మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై చర్చ రెండో సిట్టింగ్లోనా?
రామచంద్రభారతి: సరే. 26న ఉదయం నేను హైదరాబాద్ వస్తా. ఆరోజు సాయంత్రం తుషార్, సంతోష్‌కి ఫోన్ చేసి మాట్లాడుతా. ఇదే కాదు ఢిల్లీలో కూడా మేం ఆపరేషన్ నడిపిస్తున్నాం. ఢిల్లీలో 43 మంది ఉన్నారు
నందు: మీరొచ్చేప్పుడు ఏమైనా తీసుకొస్తే..?
రామచంద్రభారతి: నాకు తెలుసు. సంతోష్, శరత్‌తో దీనిగురించే మాట్లాడా
నందు: భద్రత గురించి ఎలా?
రామచంద్రభారతి: జడ్ క్యాటగిరీ కుదరదు గానీ, రఘుకి ఇచ్చినట్టు వై ప్లస్ ఇవ్వగలం
నందు: ఓ.. రఘు అంటే రఘురాం కృష్ణంరాజు.
(సింహయాజి లైన్లోకి వచ్చారు)
సింహయాజి: జై శ్రీమన్నారాయన్.. స్వామీజీ! నమస్తే
రామచంద్రభారతి: హా నమస్తే, నమస్తే.. ఎలా ఉన్నారు?
సింహయాజి: బాగున్నా
రామచంద్రభారతి: 26న హైదరాబాద్‌కు వస్తా. వాళ్లను కలిసి మాట్లాడుతా. అంతా బాగుంటే, తుషార్‌కు ఫోన్
చేస్తా. సాయంత్రం లోపు అతను వస్తాడు. అంతా ఓకే అనుకొంటే.. 27న ఉదయం చార్టర్ విమానంలో ఢిల్లీకి వెళ్దాం
సింహయాజి: ఓకే స్వామి
రామచంద్రభారతి: అయితే, నందు చెబుతున్న వ్యక్తులు వస్తారా? 100 కోట్లు ఇవ్వమన్నా ఇస్తాం. సమస్య లేదు. అయినా.. ఇవన్నీ ఫోన్లో వద్దు. ముఖాముఖిగా చర్చిద్దాం
సింహయాజి: అవును
రామచంద్రభారతి: హా
సింహయాజి: అయితే, స్వామీజీ.. మిగతా ముగ్గురు కూడా సిద్ధమే. అయితే 100 కోట్ల కంటే ఎక్కువ అంటున్నారు
రామచంద్రభారతి: వాళ్లు వస్తానంటే డబ్బుల సమస్య లేదు
సింహయాజి: వాళ్లు వస్తారు స్వామీజీ. ఇంకో విషయం. మన నందు తన భద్రత గురించి భయపడుతున్నాడు
రామచంద్రభారతి: మరేం భయంలేదు స్వామీజీ. ఈ విషయం ఎవరికీ తెలియనివ్వం. ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు
సింహయాజి: నేను కూడా ఇదే చెప్పా
రామచంద్రభారతి: కేంద్రప్రభుత్వ భద్రత మనకు ఉంది. స్టేట్ సెక్యూరిటీ కాదుగా
సింహయాజి: నాది మరో విజ్ఞప్తి ఏమిటంటే.. నందుకు వెంటనే ఏదో ఓ పోస్ట్ ఇప్పించండి
రామచంద్రభారతి: తప్పకుండా
సింహయాజి: సరే స్వామీజీ
రామచంద్రభారతి: సంతోష్‌తో జరిగిన సమావేశంలో నందు కూడా ఉన్నాడు. అప్పుడే నేను ఆఫర్ చేశా. అయినా.. మనం అనుకున్న వ్యక్తులు వస్తే, అంతా జరిగిపోతుంది
సింహయాజి: వంద శాతం పక్కా స్వామీ
రామచంద్రభారతి: ఎమ్మెల్యేల నంబర్ రెడీగా ఉంటే పోస్ట్, ప్రొటెక్షన్ గురించి భయపడొద్దు
సింహయాజి: ముగ్గురు తర్వాత.. ఒకరివెంట ఒకరు 50 మంది వస్తారు
రామచంద్రభారతి: ముగ్గురు, నలుగురు రాజీనామా చేయగానే.. ప్రభుత్వమే పడిపోతుంది
సింహయాజి: అవును స్వామీ
రామచంద్రభారతి: దాని కోసమే.. రోహిత్‌రెడ్డి మీద ఇంత పెడుతున్నాం. ఎంత మంది వస్తున్నారో రహస్యంగా ఉంచు. ఎవరితో చెప్పొద్దు
సింహయాజి: అలాగే స్వామీ
రామచంద్రభారతి: సరే
817182