తెలంగాణ: హైదరాబాద్: ట్యాంక్‌బండ్‌లోని పీవీ మార్గ్ నెక్లెస్ రోడ్డులో నిర్మిస్తున్న బీఆర్ డాక్టర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ శాంతికుమారి శనివారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

తెలంగాణ: హైదరాబాద్: ట్యాంక్‌బండ్‌లోని పీవీ మార్గ్ నెక్లెస్ రోడ్డులో నిర్మిస్తున్న బీఆర్ డాక్టర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ శాంతికుమారి శనివారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన ఈ భారీ విగ్రహాన్ని అంబేద్కర్ జయంతి రోజున ఆవిష్కరించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి (సీఎం కేసీఆర్) ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఈఎన్సీ గణపతిరెడ్డితో కలిసి సీఎస్ పనులను పరిశీలించారు. ఈ పనులన్నీ ఏప్రిల్ 10లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అంబేద్కర్ విగ్రహం కింద నిర్మాణంలో ఉన్న యాంపీ థియేటర్ నిర్మాణాన్ని పరిశీలించారు. విగ్రహం పరిధిలో ల్యాండ్ స్కేపింగ్, ఇతర సివిల్ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని పరిశీలించే ముందు కొత్త సచివాలయ నిర్మాణ పురోగతిని కూడా సీఎస్ సమీక్షించారు.
