ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది. కానీ అతనికి ఏమీ జరగలేదు. మరోవైపు పలు వాహనాలు ఢీకొనడంతో కొంత మంది గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. హర్పాల్‌పూర్‌లోని బైతాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్‌లో పాల్గొనేందుకు అఖిలేష్ యాదవ్ వెళ్తున్నారు. ఇంతలో ఫర్హత్ నగర్ రైల్వే క్రాసింగ్ సమీపంలోని వంక వద్ద అఖిలేష్ యాదవ్ కాన్వాయ్ కు చెందిన కారు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు.
దీంతో వెనుక నుంచి వేగంగా వస్తున్న కార్లు ఒకదాని తర్వాత ఒకటి ఢీకొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఆరు కార్లు ధ్వంసమయ్యాయి. కొందరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారికి వెంటనే అంబులెన్స్‌లో చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ప్రమాదంలో అఖిలేష్ యాదవ్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. అనంతరం క్షేమంగా వేదిక వద్దకు చేరుకున్నారు. మరోవైపు ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అఖిలేష్ కాన్వాయ్ ప్రమాదం..! appeared first on T News Telugu
