CCMB | బయోసైన్స్ రంగంలో యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిం చేలా సీసీఎంబీలోని(CCMB) అటల్ ఇంక్యుబేషన్ సెంటర్‌కు(Atal Incubation Center) మరో ముందడుగు వేసింది.

సిటీబ్యూరో, ఏప్రిల్ 11(నమస్తే తెలంగాణ) : బయోసైన్స్ రంగంలో యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిం చేలా సీసీఎంబీలోని(CCMB) అటల్ ఇంక్యుబేషన్ సెంటర్‌కు(Atal Incubation Center) మరో ముందడుగు వేసింది. లైఫ్ సైన్సెస్‌లో స్టార్టప్, పరిశోధనలను ప్రోత్సహించే బ్లాక్ చైన్ ఫర్ ఇంఫాక్ట్(Blockchain for Impact) అటల్ ఇంక్యుబేషన్ సెంటర్‌తో కలిసింది. దేశంలోని తొలి లైఫ్ సైన్స్ ఇంక్యుబేషన్ సెంటర్‌గా గుర్తింపు పొందిన ఏఐసీలో పదుల సంఖ్యలో స్టార్టప్ సంస్థలు కార్యాకలాపాలు నిర్వహిస్తున్నాయి.
ఈ క్రమంలో యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. గురువారం జరిగిన ఈ ఒప్పందం ద్వారా ఏఐసీ పరిశోధనలు, వినూత్న ఆవిష్కరణలకు 1.5లక్షల డాలర్లను బీఎఫ్‌ఐ కేటాయించనుందని ఏఐసీ సీఈవో డా. ఎన్ మధుసూదన రావు తెలిపారు. వైద్య, పరిశోధన రంగానికి మధ్య వంతెనల బీఎఫ్‌ఐ పనిచేయనుంది.
ఈ ఒప్పందం ద్వారా గ్రామీణ స్థాయిలో ఎన్నో ఆవిష్కరణలను వెలుగులోకి తీసుకురావచ్చని, ప్రస్తుతం వైద్యారోగ్య రంగంలో ఎదురవుతున్న ఎన్నో సవాళ్లకు పరిష్కార మార్గాలను వెదికే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. సీసీఎంబీ-ఏఐసీలో జరిగిన సమావేశంలో బీఎఫ్‌ఐ సీఈవో డా. గౌరవ్ సింగ్, ప్రతినిధులు పాల్గొన్నారు.