కన్నడ సినీ నటుడు శివరాజ్ కుమార్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. వరుస సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్న ఆయన ఇటీవలే శివమొగ్గ నియోజకవర్గం నుంచి లోక్‌సభ బరిలోకి దిగిన తన భార్య గీతా శివరాజ్ కుమార్ తరఫున ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం శివరాజ్ కుమార్ అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. దీంతో వెంటనే ఆయన్ని బెంగళూరు లోని ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రెగ్యులర్ చెకప్‌కోసం మరోసారి ఆసుపత్రికి వెళ్లిన శివరాజ్ కుమార్.. డాక్టర్ల సూచనల మేరకు మరోసారి అడ్మిట్ అయినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: ఫోన్ ట్యాపింగ్ కాదు.. వాటర్ ట్యాపింగ్ పైన దృష్టి పెట్టండి
The post అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సినీ నటుడు శివరాజ్ కుమార్ appeared first on tnewstelugu.com.