అనుమానస్పద స్థితిలో గిరిజన బాలిక మృతి చెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పెదకొండేపూడి గ్రామంలో చోటుచేసుకుంది. ప్రధానోపాధ్యాయిని, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పెదకొండేపూడికి చెందిన ఈరేటి వసంత స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదవుతోంది. సోమవారం ఉదయం ఎప్పటిలాగానే పాఠశాలకు వెళ్లి సహచర పిల్లలతో ఉత్సాహంగా ఉంది. మధ్యాహ్నం భోజనం చేసి ఇంటికి వెళ్లింది. అక్కడ పూరిగుడిసె వెదురు దూలానికి చీరతో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమీపంలోనే బాలిక ఇల్లు ఉండటంతో పుస్తకాల కోసం వెళ్లిందని ప్రధానోపాధ్యాయిని ప్రవీణ చెబుతోంది. మధ్యాహ్న విరామ సమయం ముగిసిన తిరిగి రాకపోవడంతో ..ఇంతలో ఉరేసుకుని మరణించినట్లు తెలిసిందన్నారు.
వసంతకు వచ్చే ఏడాది ఆరోతరగతిలో సాంఘిక సంక్షేమ పాఠశాలలో చదివించేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. బాలికకు తల్లి ఉన్నా మానసికస్థితి అంతంత మాత్రమే. దీంతో బంధువుల వద్ద ఉంటోంది. శరీరంపై ఎలాంటి గాయాలు లేవని అనుమానస్పద మ్రుతిగా కేసు నమోదు చేసుకుని మ్రుతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించామని ఎస్సై తెలిపారు. విచారణ నివేదికను జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పంపించినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: జమ్మూకశ్మీర్ లో భారీ భూకంపం..రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదు..!!
