లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘పౌరసత్వ సవరణ చట్టం-2019 (CAA)’ అమల్లోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను ఇవాళ( సోమవారం) కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. 2019 డిసెంబర్లో ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య సీఏఏ చట్టం-2019 పార్లమెంటు ఆమోదం పొందింది. దీనికి రాష్ట్రపతి సమ్మతి కూడా లభించింది. కానీ, పూర్తి నిబంధనలపై సందిగ్ధత నెలకొనడంతో ఈ చట్టం అమలు కార్యరూపం దాల్చలేదు. లోక్సభ ఎన్నికల ముందే దీన్ని అమల్లోకి తీసుకొస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల తెలిపారు.
సీఏఏ ప్రకారం.. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల దగ్గర తగిన పేపర్లు లేకపోయినా వారికి సత్వరం పౌరసత్వాన్ని ఇచ్చేందుకు ఈ నిబంధనల్ని కేంద్రం రూపొందించింది. 2014 డిసెంబరు 31 కంటే ముందు ఈ మూడు దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి. ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే ముగుస్తుంది. తాజాగా కేంద్రం నిబంధనలు నోటిఫై చేయడంతో అమలులోకి వచ్చింది.
ఇది కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డి దళిత జాతికి క్షమాపణ చెప్పాలి
