అమెరికాలో తుపాకీ సంస్కృతి మరోసారి కలకలం రేపింది. బుధవారం అర్ధరాత్రి ఉటాలో జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది చనిపోయారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. వారిలో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. ఇది హనోక్ నగరంలోని ఓ ఇంట్లో జరిగింది. అయితే ఈ దాడికి పాల్పడింది ఎవరు.. ఆ ఘటన వెనుక ఉద్దేశం ఏమిటనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. హత్యపై పోలీసులు విచారణ ప్రారంభించారు.