అయోధ్యలో కొలువైన రాములవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. రాములోరి దర్శనానికి దేశం నలుమూలలా నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు పోటెత్తుతున్నారు. నెల రోజుల్లో 60లక్షల మందికి పైగా భక్తులు బాలరాముడిని దర్శించుకున్నారు. రూ. 25కోట్లు విరాళాలు, 25కేజీల బంగారం, వెండి ఆభరణాలు సమర్పించినట్లు రామమందిర ట్రస్టు వెల్లడించింది. అయితే ట్రస్టుకు సంబంధించిన బ్యాంకు అకౌంట్లో భక్తులు నేరుగా జరిగిన ఆన్ లైన్ లావాదేవీల వివరాల గురించి తమకు తెలియదని చెప్పారు.
కాగా త్వరలోనే శ్రీరామ నవమి వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సుమారు 50లక్షల మంది భక్తులు అయోధ్యకు వచ్చే అవకాశం ఉందని ట్రస్టు అంచనా వేసింది. ఆ సమయంలో విరాళాలు కూడా భారీగానే అందే అవకాశం ఉండటంతో రసీదుల జారీకీ కంప్యూటరైజ్డ్ కౌంటర్లతోపాటు అదనపు హుండీలను ఏర్పాటు చేస్తామని ట్రస్టు అధికారి మీడియాకు తెలిపారు. భారీ మొత్తంలో వచ్చే నాలుగు ఆటోమెటిక్ హైటెక్ కౌంటింగ్ మెషీన్లు ఎస్బీఐ ఏర్పాటు చేసిందని చెప్పారు. భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాల నిర్వహణను ప్రభుత్వం మింట్ కు అప్పగించినట్లు చెప్పారు.
ఇది కూడా చదవండి : పాస్ పోర్టు ఈ సేవా కేంద్రంలో అగ్నిప్రమాదం..కాలిబూడిదైన డాక్యుమెంట్లు..!
