
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లాలో 33 మంది మావోయిస్టు మిలీషియామెన్, ఒక మావోయిస్టు సాయుధ సభ్యురాలు భారతి బుధవారం నాడు ఎస్పీ సతీష్ కుమార్ ఎదుట లొంగిపోయారు. గతంలో భారతికి ప్రభుత్వం రూ.లక్ష రివార్డు ప్రకటించిందని తెలిపారు. లొంగిపోయిన మిలీషియా సభ్యులకు పునరావాసం కల్పిస్తామని వెల్లడించారు. లొంగిపోయిన వారి నుంచి గనులు, పేలుడు పదార్థాలు, వాకీటాకీలు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు.
873102
