Operation Meghdoot: సియాచిన్ గ్లేసియర్‌ను చేజిక్కించుకునేందుకు 1984, ఏప్రిల్ 13వ తేదీన ఆపరేషన్ మేఘదూత్ పేరుతో ఇండియన్ ఆర్మీ ఓ ఆపరేషన్ నిర్వహించింది. ఆ సైనిక చర్య ఫలితంగా భారత దళాలకు సియాచెన్ హిమానీనదం ప్రాంతం మొత్తంపై నియంత్రణ వచ్చింది. ఆపరేషన్ మేఘదూత్ చేపట్టి నేటికి 40 ఏళ్లు పూర్తి అయ్యింది. ఈ నేపథ్యంలో ఇవాళ భారతీయ సైనిక దళం ఓ వీడియోను రిలీజ్ చేసింది.

న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్, చైనా సరిహద్దుల్లో ఉన్న అత్యంత కీలకమైన హిమ ప్రాంతం సియాచిన్. ఈ ప్రాంతంపై తొలుత పాక్ ఆక్రమణ చేపట్టింది. అయితే మెల్లగా తేరుకున్న భారత్ .. కీలకమైన సియాచిన్‌ను సొంతం చేసుకునేందుకు ఓ ఆపరేషన్ చేపట్టింది. 1984, ఏప్రిల్ 13వ తేదీన ఆపరేషన్ మేఘదూత్(Operation Meghdoot) పేరుతో ఇండియన్ ఆర్మీ ఆ ఆపరేషన్ నిర్వహించింది. ఆ సైనిక చర్య ఫలితంగా భారత దళాలకు సియాచెన్ గ్లేసియర్ ప్రాంతం మొత్తంపై నియంత్రణ చేకూరింది. ఆపరేషన్ మేఘదూత్ చేపట్టి నేటికి 40 ఏళ్లు పూర్తి అయ్యింది. ఈ నేపథ్యంలో ఇవాళ భారతీయ సైనిక దళం ఓ వీడియోను రిలీజ్ చేసింది. అత్యంత ఎత్తైన కదనరంగంగా కీర్తించిన సియాచిన్ గురించి, మేఘదూత్ ఆపరేషన్ గురించి ఆ వీడియోలో చూపించారు.
#WATCH | Indian Army releases a video on the occasion of 40 years of Operation Meghdoot in the world’s highest battlefield Siachen Glacier in Ladakh. pic.twitter.com/NOcVYr7k5H
— ANI (@ANI) April 13, 2024