ఏప్రిల్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్) లబ్ధిదారుల ఐడీని ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఖాతా (ఏబీహెచ్‌ఏ) ఐడీతో అనుసంధానించటాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ మేరకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొన్నది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: ఏప్రిల్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్) లబ్ధిదారుల ఐడీని ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఖాతా (ఏబీహెచ్‌ఏ) ఐడీతో అనుసంధానించటాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ మేరకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొన్నది.
ఇప్పటికే ఉన్న లబ్ధిదారులు తమ సీజీహెచ్‌ఎస్ ఐడీని 30 రోజుల్లోపు అభా ఐడీతో లింక్ చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు సమగ్ర ఆరోగ్య సంరక్షణు అందించే లక్ష్యంతో 1954లో కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్) ప్రారంభించారు. ప్రస్తుతం 75 నగరాల్లో 41 లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఈ పథకం కింద ఉన్నారు. ఆయుష్మాన్ భారత్‌ను ప్రధాని నరేంద్ర మోదీ 2018 సెప్టెంబర్ 23న ప్రారంభించారు.
