ములుగు: ములుగు జిల్లా మంగపేటలో కారు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. మంగపేట మండలం రాజుపేటలో గురువారం ఉదయం ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ మృతి చెందింది. చాలా మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
బస్సు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుంచి హనుమకొండకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు ఆయన తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.