ఆర్ట్ సమ్మర్ క్యాంపు |హైదరాబాద్ : మాసబ్ ట్యాంక్ , జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో వేసవి కళాశిబిరం నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ టి.గంగాధర్ తెలిపారు. 2023 ఆర్ట్ సమ్మర్ క్యాంపులో మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్నామని, 8 నుంచి 15 ఏళ్లలోపు పిల్లలకు పెయింటింగ్, డ్రాయింగ్, పాటరీ, కాలిగ్రఫీ, ఫొటోగ్రఫీ, యానిమేషన్ తదితర అంశాల్లో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు.

అదేవిధంగా ప్రతి శుక్ర, శనివారాల్లో నిపుణులతో మోటివేషనల్, కమ్యూనికేషన్ స్కిల్స్ సెషన్‌లు ఉంటాయని, ప్రతిరోజూ యోగా సెషన్‌లు ఉంటాయని తెలిపారు. ఈ శిబిరం 31 రోజుల పాటు కొనసాగుతుంది మరియు సమయం ఉదయం 9:00 నుండి సాయంత్రం 4:00 గంటల వరకు ఉంటుంది. వివరాల కోసం, దయచేసి వేసవి శిబిరం సమన్వయకర్త జె. వెంకటేశ్వర్లును 9347048708, 8099224945, 040-23343616 నంబర్లలో సంప్రదించండి.