
ఆక్లాండ్: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్‌పై 2-0తో టీ20 సిరీస్ చేజిక్కించుకుంది. తొలి పోరులో ఉత్కంఠభరిత విజయం సాధించిన కంగారూలు శుక్రవారం జరిగిన రెండో టీ20లో 72 పరుగుల తేడాతో కివీస్‌ను చిత్తుచేశారు. మొదట ఆసీస్ 19.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటైంది.
ట్రావిస్ హెడ్ (45) కమిన్స్ (28) రాణించారు. కివీస్ బౌలర్లలో ఫెర్గూసన్ 4 వికెట్లు తీశాడు. అనంతరం న్యూజిలాండ్ 17 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌటైంది. ఫిలిప్స్ (42) ఒంటరి పోరాటం చేయగా.. ఆసీస్ బౌలర్లలో జాంపా 4 వికెట్లే పడగొట్టాడు.
