నమస్తే మేడం. నా వయసు 28 సంవత్సరాలు. పెండ్లి కాలేదు. నెలసరి సక్రమంగానే వస్తుంది. అయితే ఇటీవల నెలసరి స్రావం దుర్వాసన వస్తున్నది. ఇదేమైనా అనారోగ్య సూచనా?
నమస్తే మేడం. నా వయసు 28 సంవత్సరాలు. పెండ్లి కాలేదు. నెలసరి సక్రమంగానే వస్తుంది. అయితే ఇటీవల నెలసరి స్రావం దుర్వాసన వస్తున్నది. ఇదేమైనా అనారోగ్య సూచనా?
-ఓ పాఠకురాలు
సాధారణంగా నెలసరి స్రావాలు దుర్వాసన ఉండవు. మీకు కూడా ఇంతకుమునుపు లేదనే చెబుతున్నారు. ఇలా దుర్వాసన రావడం అన్నది ఇన్ఫెక్షన్ల సూచన. మీకు పెండ్లి కాలేదు అని చెబుతున్నారు కనుక ఫంగల్ లేదా, బ్యాక్టీరియల్ వ్జైనోసిస్ తరహా ఇన్ఫెక్షన్లలాంటివి ఏమైనా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందు డాక్టర్ని సంప్రదిస్తే కారణం ఏదో చెబుతారు. దాన్ని బట్టి మందులు వాడితే దుర్వాసన దూరం అవుతుంది. ఇక, మరో విషయం. మీరు మెన్స్ట్రువల్ హైజీన్ పాటిస్తున్నారా?… అంటే కనీసం ప్రతి ఏడెనిమిది గంటలకు లేదా స్రావాలను బట్టి ఇంకా త్వరగా ప్యాడ్లను మార్చుకుంటున్నారా లేదా అన్నది చూసుకోండి. నెలసరి సమయంలో సరైన పరిశుభ్రతను పాటించండి. ఇది మహిళలను చాలా ఇబ్బందుల నుంచి కాపాడుతుంది.
-డాక్టర్ పి. బాలాంబ,
సీనియర్ గైనకాలజిస్ట్