Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

ఇంగ్లండ్‌ను దాటిన భారత్‌.. శతకం దిశగా సాగుతున్న రాహుల్‌-Namasthe Telangana

TelanganapressBy TelanganapressJanuary 26, 2024No Comments

IND vs ENG 1st Test: ఉప్పల్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో మొదట బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్‌ చేసిన 246 పరుగులను దాటేసి ఆధిక్యం దిశగా సాగుతోంది

January 26, 2024 / 12:53 PM IST
IND vs ENG 1st Test: ఇంగ్లండ్‌ను దాటిన భారత్‌.. శతకం దిశగా సాగుతున్న రాహుల్‌

IND vs ENG 1st Test: హైదరాబాద్‌ టెస్టులో తొలి రోజు బౌలింగ్‌లో అదరగొట్టిన భారత్‌.. రెండో రోజు బ్యాటింగ్‌లోనూ అదరగొడుతున్నది. ఉప్పల్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో మొదట బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్‌ చేసిన 246 పరుగులను దాటేసి ఆధిక్యం దిశగా సాగుతోంది. యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ సెంచరీ మిస్‌ చేసుకున్నా కెఎల్‌ రాహుల్‌ మాత్రం శతకం సాధించే దిశగా సాగుతున్నాడు.లంచ్‌ విరామం తర్వాత అతడు దూకుడు పెంచాడు. 58 ఓవర్ల ఆట ముగిసేటప్పటికీ భారత్‌.. 4 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్‌ ఆధిక్యం 8 పరుగులు కాగా రాహుల్‌.. 79 (104 బంతుల్లో, 8 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులతో క్రీజులో ఉన్నాడు. అతడికి తోడుగా రవీంద్ర జడేజా (7 నాటౌట్‌) ఆడుతున్నాడు.

లంచ్‌ విరామానికి భారత్‌.. 50 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. లంచ్‌ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన టీమిండియాకు 52 ఓవర్లో రిహాన్‌ అహ్మద్‌ షాకిచ్చాడు. అతడు వేసిన ఆ ఓవర్లో శ్రేయస్‌ అయ్యర్‌ (63 బంతుల్లో 35, 3 ఫోర్లు, 1 సిక్స్‌) భారీ షాట్‌ ఆడబోయి డీప్‌ మిడ్‌ వికెట్‌ వద్ద టామ్‌ హర్ట్లీ చేతికి చిక్కాడు. కానీ అహ్మద్‌ వేసిన 55వ ఓవర్లో రాహుల్‌ రెండు ఫోర్లు కొట్టాడంతో పాటు అతడే వేసిన 56వ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదాడు. రెండో సిక్సర్‌ కొట్టడంతో భారత్‌ ఇంగ్లండ్‌ స్కోరును సమం చేసి ఆధిక్యం సాధించింది.

 

MAXIMUM x 2 💥@klrahul dealing in sixes in Hyderabad 😎

Follow the match ▶️ https://t.co/HGTxXf8b1E#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/kKWTX2mNhV

— BCCI (@BCCI) January 26, 2024



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.