హనుమకొండ జిల్లాలో దారుణం జరిగింది.ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తి గ్రామానికి చెందిన వలుగుల సాహిత్య భీమారం బ్రాంచ్ శివాని ఇంటర్మీడియట్ కాలేజీలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. నిన్న ఆమె అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. గురువారం రాత్రి కాలేజీ బిల్డింగ్పై నుంచి దూకినట్లుగా చెబుతున్నారని మృతురాలి బంధువులు తెలిపారు.
గురువారం రాత్రి ఘటన జరిగినా..ఇవాళ(శుక్రవారం) ఉదయం వరకు తమకు సమాచారం అందించలేదని, నేరుగా పోస్ట్ మార్టం తరలించాక ఫోన్లో తెలిపారని అన్నారు. విద్యార్థిని మృతిపై యాజమాన్యం రహస్యంగా ఉంచడంపై అనుమానాలున్నాయని తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి: ఎన్నికల్లో ఇవ్వని హామీను కూడా మేము అమలు చేశాం
