ఈ మధ్య కాలంలో ఇండిగో విమానాలు తరచుగా వార్తల్లో ఉంటున్నాయి.తాజాగా మరో వీడియో బయటకు వచ్చింది. ఈవీడియోతో ఇండిగో విమానంలో పరిశుభ్రతపై వివాదం బయటకు వచ్చింది. విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు ఫుడ్ సెక్షన్ లో బొద్దింకలను చూసి దానిని వీడియో తీశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేవాడు. ఇది కాస్త వైరల్ గా మారింది. ఇండిగో విమానంలో శుభ్రత ప్రొటోకాల్ పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ..ఇండిగో ఫ్లైట్ సిబ్బంది రియాక్ట్ అయ్యారు. ప్రయాణీకుల భద్రతను పరిగణలోనికి తీసుకుని విమానాల పరిశుభ్రతపై చర్యలుతీసుకుంది. ఎయిర్‌లైన్ పరిశుభ్రత పట్ల తన నిబద్ధతను నొక్కి చెప్పింది.ఏదైనా అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. “మా సిబ్బంది వెంటనే విమానంలో అవసరమైన చర్య తీసుకున్నారు. ముందుజాగ్రత్త చర్యగా, మేము తక్షణమే మొత్తం విమానాలను శుభ్రపరిచాము. ధూమపానం, క్రిమిసంహారక ప్రక్రియలను నిర్వహించాము. ఇండిగోలో, సురక్షితమైన, అవాంతరాలు లేని అనుభవాన్ని అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము.” మేము పరిశుభ్రత,అత్యున్నత ప్రమాణాలను నిర్వహిస్తాము. ప్రయాణీకులకు ఏదైనా అసౌకర్యం కలిగితే చింతిస్తున్నాము.” అని ఇండిగో వివరణ ఇచ్చింది.
అయితే ఈ వీడియో వైరల్ అయిన వెంటనే, సోషల్ మీడియా వినియోగదారులు ఇండిగో ఎయిర్‌లైన్ పరిశుభ్రతను పాటించడం లేదని విమర్శించారు. “అంతర్జాతీయ విమానాలు అత్యంత చెత్తగా ఉంటాయి. ఎల్లప్పుడూ ఆలస్యంగా ఉంటాయి.కాంప్లిమెంటరీ డ్రింక్స్ ఉండవు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
ఇది కూడా చదవండి:ఇన్సూరెన్స్ డబ్బుల కోసం దారుణం..అమ్మమ్మను మనవడు ఏం చేశాడో తెలుసా?
IndiGo says :
We are aware of the video that was circulated on social media showing an unclean corner in one of our aircraft.
Our staff promptly took the necessary action onboard. As a precautionary measure, we immediately cleaned the entire fleet and carried out fumigation…
— Tarun Shukla (@shukla_tarun) February 22, 2024
