హర్యానా ఇండియన్ నేషనల్ లోక్‌దళ్(ఐఎన్ఎల్డీ) చీఫ్, మాజీ ఎమ్మెల్యే నఫే సింగ్ రాథీని ఇవాళ(ఆదివారం) సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. ఆయన ప్రయాణిస్తున్న ఎస్యూవీ కార్‌పై కాల్పులు జరిపారు. ఈ ఘటన ఝజ్జర్ జిల్లాలో జరిగింది. అతనితో పాటు మరో ఇద్దరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కారులో వచ్చిన దుండగులు సమీపం నుంచి రాథీ, అతని అనుచరులపై కాల్పులు జరిపారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు.
గాయపడిన వారిని వెంటనే వైద్య చికిత్స కోసం సమీపంలోని బ్రహ్మశక్తి సంజీవని ఆస్పత్రికి తరలించగా.. రాథీ మార్గ మధ్యలోనే చినిపోయినట్లు తెలిపారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, అతని సన్నిహితులు కాలా జాతేడీ ఈ దాడి వెనక ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
నఫే సింగ్ రాథీ హర్యానా అసెంబ్లీకి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. హర్యానా లెజిస్లేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఈ ఘటన తర్వాత పోలీసులు, దుండగులు పారిపోయేందుకు అవకాశం ఉన్న అన్ని మార్గాలపై నిఘా పెట్టారు. సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నారు.సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ , STF బృందాలు కేసు దర్యాప్తు ప్రారంభించాయని, నిందితులను వీలైనంత త్వరగా అరెస్టు చేస్తామని ఝజ్జర్ ఎస్పీ అర్పిత్ జైన్ చెప్పారు.
ఇది కూడా చదవండి: నోటీసులు రద్దు చేయండి.. 26న విచారణకు హాజరుకావడం సాధ్యం కాదు
