షాపింగ్ మాల్ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ అంజలి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళంలో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ తెలుగులో మాత్రం స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాల వంటి సినిమాలతో ఆమె పాపులారిటీ కాస్త పెరిగింది. 2014లో రిలీజ్ అయిన కామెడీ హర్రర్ థ్రిల్లర్ సూపర్ హిట్ సినిమా గీతాంజలీతో మంచి విజయాన్ని అందుకుంది.
అంజలీ టైటిల్ రోల్ పోషిస్తున్న తాజా మూవీ గీతాంజలి మళ్లీ వచ్చింది. ఈ సినిమా గీతాంజలికి సీక్వెల్ గా రాబోతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి పెద్ద అప్ డేట్ వచ్చింది. ఫిబ్రవరి 24న రాత్రి 7గంటలకు బేగంపేట శ్మశాన వాటికలో ఈ మూవీ టీచర్ ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేశారు. ఇది తెలుసుకున్న నెటిజన్లు స్మశాన వాటికలో టీజర్ విడుదల ఏంటి అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇలా స్మశాన వాటికలో టీచర్ లాంచ్ చేయడం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రిలో ఇదే మొదటిసారి అని అంటున్నారు. ఈ టీజర్ లాంచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ శనివారం రాత్రి 7 గంటలకు బేగంపేట్ స్మశాన వాటికలో ⚰️ గీతాంజలి మళ్ళీ వచ్చింది టీజర్ లాంచ్ 🥶👻
Brace Yourselves for a Never Before Event In Telugu Cinema ❄️🔥#GeethanjaliMalliVachindhi #Anjali50 @yoursanjali @konavenkat99 @MP_MvvOfficial pic.twitter.com/RhqvoifKB4
— BA Raju’s Team (@baraju_SuperHit) February 22, 2024
ఇది కూడా చదవండి: ఇది కూడా చదవండి: గంజాయి కేసులో బిగ్ బాస్ ఫేం షణ్ముఖ్ అరెస్ట్..!!
