Avesham | 2024 మొదటి త్రైమాసికంలో మాలీవుడ్ నుంచి ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్, The Goat Life సినిమాలు 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయాయి. తాజాగా మరో సినిమా ఆ దిశగా పరుగులు పెడుతోంది.
Avesham | ఇటీవల కాలంలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్న సినిమాల్లో మాలీవుడ్ నుంచి టాప్ ప్లేస్‌లో నిలుస్తున్నాయి. 2024 మొదటి త్రైమాసికంలో మాలీవుడ్ నుంచి ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్, The Goat Life సినిమాలు 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయాయి. తాజాగా మరో సినిమా ఆ దిశగా పరుగులు పెడుతోంది. పాపులర్ మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) నటించిన తాజా చిత్రం ఆవేశం (Avesham).
యాక్షన్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో రోమాంచం ఫేం జీతూ మాధవన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లు రాబోతుంది. ఇప్పటికే ఆవేశం రూ.50 కోట్ల క్లబ్‌లోకి ఎంటరైంది. సోమవారం కూడా అడ్వాన్స్ బుకింగ్స్ పెద్ద సంఖ్యలో కొనసాగుతుండగా.. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా తన వాహ చాటుతోంది. ఆవేశం సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ త్వరలోనే 100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం పక్కా అని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నాయి. ఈ చిత్రాన్ని నజ్రియా నజీమ్ నిర్మించడం విశేషం.
రూ.100 కోట్ల క్లబ్ దిశగా
#aavesham TO 50CR CLUB 🔥🔥 Another 50 For FaFa After #Njanprakashan.
100CR POSSIBLE IN THIS TREND🔥#Aavesham #Fafa #FahadhFaasil pic.twitter.com/qMlYjP33tU
— Adwaith (@AdwaithAk188943) April 15, 2024