పాకిస్థాన్ మాజీ ప్రధాని, జస్టిస్ మూవ్మెంట్ (పీటీఐ) చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో జరగనున్న జాతీయ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఆయన 33 స్థానాల్లో పోటీ చేయనున్నారు. పార్టీ ఉపాధ్యక్షుడు షా మహమ్మద్ ఖురేషీ ఈ విషయాన్ని తెలిపారు. ముందస్తు ఎన్నికలు వస్తే అధికార పార్టీపై ఒత్తిడి పెంచేందుకే పీటీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 33 పార్లమెంటరీ స్థానాలకు మార్చి 16న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు పాకిస్థాన్ ఎన్నికల సంఘం ప్రకటించింది.
పంజాబ్‌లో 12, ఖైబర్ పఖ్తుంఖ్వాలో 8, ఇస్లామాబాద్‌లో 3, సింధ్‌లో 9, బలూచిస్థాన్‌లో ఒక స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఇమ్రాన్ ఖాన్ ఇన్ని స్థానాల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి కాదు. గతేడాది అక్టోబర్‌లో జరిగిన జాతీయ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 7 స్థానాలకు పోటీ చేసి 6 స్థానాల్లో విజయం సాధించారు. పాకిస్థాన్ రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి ఎన్ని సీట్లకైనా పోటీ చేయవచ్చు. అయితే ఒకటి కంటే ఎక్కువ సీట్లు గెలిస్తే ఏయే సీట్లు వదులుకుంటారో ఎన్నికల సంఘానికి తెలియజేయాలి.
The post 33 సీట్లకు ఇమ్రాన్ ఖాన్ రేసు appeared first on T News Telugu
