ఇజ్రాయెల్, ఇరాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగాయి. సిరియా రాజధాని డమస్కస్ లోని ఇరాన్ రాయబార కార్యాలయ కాన్సులర్ విభాగంపై ఇజ్రాయెల్ వైమానిక దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఇరాన్ కు చెందిన ఇద్దరు జనరల్స్, ఐదుగురు అధికారులు మరణించారని సిరియా అధికారులు, ఇరాన్ సైన్యం తెలిపాయి.
దాడి ఘటనలో కుప్పకూలిన కాన్సులర్ భవనం పక్కనే రాయబార కార్యాలయం కూడా ఉంది. ఈ దాడిలో మరణించిన ఇరాన్ జనరల్ అలీ రెజా జెహ్ దీ 2016 వరకు లెబనాన్, సిరియా దేశాల్లో ఖుద్స్ బలగాలకు నేత్రుత్వం వహించారు. గత అక్టోబర్ 7న జరిగిన దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఈ దాడిచేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దాడి జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపాయి.
అయితే ఈ దాడిపై ఇజ్రాయెల్ ఇప్పటివరకు స్పందించలేదు. ఈ ఘటనను సిరియాలో ఇరాన్ రాయబారి హోస్సేన్ అక్బరీ ఖండించారు. దాడిలో 7గురు మరణించినట్లు తెలిపారు. ఇజ్రాయెల్ ప్రతిదాడి ఎదుర్కొక తప్పదని ఇంతే స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.
ఇది కూడా చదవండి: భగ్గుమంటున్న సూరీడు..15 జిల్లాలకు ఐఎండీ అలర్ట్..!