కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీలు ఈ ఏడాది సరికొత్త మోడల్స్ ను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నాయి. మనదేశంలో గత కొన్నేళ్లుగా ఈవీలకు పెరుగుతున్న డిమాండ్ తో సరికొత్త కార్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ప్రముఖ కంపెనీ మహీంద్రా కూడా మార్కెట్లోకి సరికొత్త శ్రేణి ఎలక్ట్రిక్ ఎస్ యూవీలను తీసుకువస్తుంది. XUV.e, BE మోనికర్ల క్రింద EVలను లాంచ్ చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. XUV.e8 నుండి ప్రారంభించి, ఈ కార్లను దశలవారీగా ప్రారంభించవచ్చు. ఈ రాబోయే మహీంద్రా ఎలక్ట్రిక్ SUVలకు సంబంధించి ఫీచర్లు ఇంకా వెల్లడి కాలేదు. ఆన్‌లైన్‌లో చాలా సమాచారం అందించింది.
మహీంద్రా తన వినియోగదారులకు 2025లో BE.05ను పరిచయం చేస్తుంది. ఇది BE శ్రేణిలో మొదటి ఎలక్ట్రిక్ SUV అవుతుంది.గతేడాది భారత్‌లో పరీక్షించిన సమయంలో ఈ కారు కనిపించింది. ఈ కొత్త కారు ఎలక్ట్రిక్ ఇంగ్లో స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. దాదాపు 4.3 మీటర్ల పొడవు ఉంటుంది.BE.05 సుమారుగా 80 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. 2WD, 4WD పవర్‌ట్రెయిన్ కాంబినేషన్‌లోవస్తున్న ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజీని ఇస్తుంది. దీనిలో మీరు LED DRL, ఫ్లష్ డోర్ హ్యాండిల్ కూపే-SUV వంటి ఫీచర్లకూడా ఉన్నాయి.ఈ మహీంద్రా కారు టెస్టింగ్ మోడల్ భారతదేశంతోపాటు…విదేశాలలో చాలాసార్లు కనిపించింది. కంపెనీ ఈ కారును 2025లో భారత మార్కెట్లో కూడా విడుదల చేయవచ్చు.
ఇది కూడా చదవండి: మరోసారి భారీగా పెరిగిన బంగారం ధరలు..తులం ఎంతంటే?
The post ఈ ఏడాది మహీంద్రా నుండి రాబోయే టాప్-4 SUV కార్లు ఇవే.! appeared first on tnewstelugu.com.
