
- డాక్టర్ విజయలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ డైరెక్టర్
పీర్జాదిగూడ, డిసెంబర్ 6: ఎవరూ అధైర్యపడకుండా వైద్య సహాయం అందజేస్తామని ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ డైరెక్టర్ డాక్టర్ విజయలక్ష్మి అన్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెన్నారెడ్డి నగర్ లో నివాసముంటున్న వెంకటయ్య, శకుంతల దంపతుల ముగ్గురు పిల్లలు మస్క్యులర్ డిస్ట్రోఫీ అనే జన్యుపరమైన సమస్యతో బాధపడుతున్నారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి తమ సమస్యలను మంత్రి కేటీఆర్కు నివేదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డాక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఐదుగురు వైద్యుల బృందం బాధితురాలి ఇంటికి చేరుకుని వారి ఆరోగ్యాన్ని పరిశీలించారు. రక్త నమూనాను సేకరించి ప్రయోగశాలకు తీసుకువెళతారు. పరీక్షల అనంతరం వ్యాధి నిర్ధారణ అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మెడికల్ కన్సల్టెంట్లు డాక్టర్ ఎం.సుజాత, శ్రీనాథ్, డాక్టర్ సునీత, డాక్టర్ శిల్పారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
872098
