ఇటీవల ఉక్రెయిన్పై రష్యా దాడులు ఎక్కువయ్యాయి. రష్యాకు చెందిన వంతెనలను ఉక్రెయిన్ బలగాలు ధ్వంసం చేయడంతో రష్యా తన దాడిని ఉధృతం చేసింది. రష్యా ముఖ్యంగా ఇంధన సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుంది. దీనికి అనుగుణంగా, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ శనివారం రష్యా దళాలు మరిన్ని ఇంధన సౌకర్యాలపై దాడి చేస్తున్నాయని ఆరోపించారు.
రష్యా సైన్యం 36 రాకెట్లను ప్రయోగించిందని, 1.5 మిలియన్ల మందికి విద్యుత్ లేకుండా పోయిందని జెలెన్స్కీ చెప్పారు. రష్యా ప్రయోగించిన 36 రాకెట్లలో చాలా వాటిని వారు అడ్డుకున్నారని ఆయన చెప్పారు. అయితే మిగిలిన రాకెట్లు తమ లక్ష్యాలను చేధించగా, ప్రజలు విద్యుత్ సమస్యలను ఎదుర్కొన్నారు. ఉక్రెయిన్ పై రష్యా దాడి సుమారు 8 నెలలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
810317