ఉత్తరాఖండ్‌లో మరో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని బలం 3.4గా నమోదైంది. అందరూ కంగారుపడి పరుగులు తీశారు. సాయంత్రం 4.25 గంటలకు భూకంపం సంభవించింది. రిషికేశ్‌లో ఐదు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఈ నెల 9న రెండుసార్లు భూమి కంపించింది. అయినా కూడా ఏమీ జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
The post ఉత్తరాఖండ్‌లో మళ్లీ భూకంపం appeared first on T News Telugu .