
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేసీఆర్ సర్కార్ శుభవార్త ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం కరువు భత్యాన్ని (డీఏ/డీఆర్) 2.73% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 17.29%ని 20.02%కి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
సీఎం కేసీఆర్ నిర్ణయంతో 4,40,000 మంది ఉద్యోగులు, 2,88,000 మంది పదవీ విరమణ పొందిన వారు లబ్ధి పొందనున్నారు. 1 జూలై 2021 నుండి, లబ్ధిదారుల ఉద్యోగులు మరియు పెన్షనర్లకు DA వర్తిస్తుంది.
పింఛనుదారులకు జనవరిలో వచ్చే పింఛన్‌తోపాటు డీఏ కూడా ఫిబ్రవరిలో చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ బకాయిలను జూలై 2021 నుండి డిసెంబర్ 2022 చివరి వరకు ఎనిమిది వాయిదాలలో GPF ఖాతాలో జమ చేస్తామని ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త…!
సీఎం కేసీఆర్ నిర్ణయంతో తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యాన్ని (డీఏ/డీఆర్) 2.73% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 17.29%ని 20.02%కి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 1/2 pic.twitter.com/hZfp10gipA
— హరీష్ రావు తన్నీరు (@trsharish) జనవరి 23, 2023
