హైదరాబాద్‌లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం నాలుగేళ్ల తర్వాత తొలిసారిగా అంతర్జాతీయ క్రికెట్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ నెల 18న వన్డే జరగనుంది. వన్డే మ్యాచ్‌లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ అజరుద్దీన్ తెలిపారు. ఈ నెల 13 నుంచి ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయం ప్రారంభం కానుంది. ఆఫ్‌లైన్‌లో టిక్కెట్లు విక్రయించబోమని చెప్పారు.
Paytm ద్వారా మాత్రమే టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విక్రయిస్తామని అజరుద్దీన్ చెప్పారు. ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు ఎల్‌బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఫిజికల్ టిక్కెట్లు తీసుకోవాలని వారు తెలిపారు.
జనవరి 14న న్యూజిలాండ్ జట్టు హైదరాబాద్ వస్తుందని, 16న భారత జట్టు వస్తుందని అజారుద్దీన్ తెలిపారు. 15న న్యూజిలాండ్ జట్టు ప్రాక్టీస్ చేయనుండగా… 17న ఇరు జట్లు ప్రాక్టీస్ గేమ్ ఆడనున్నాయి.
