దేశంలో ఓ వైపు ఎండలు మండిపోతుంటే.. ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం చలికి గజగజ వణుకుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. తాజాగా రాజధాని నగరంలో ఐదేళ్ల కనిష్టానికి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ(మంగళవారం) ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు 9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. గత ఐదేళ్లలో మార్చి నెలలో ఇంత తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే మొదటి సారి. అంతకు ముందు 2019 మార్చి 1న దేశ రాజధానిలో 6.8 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఐదేళ్ల తర్వాత ఇప్పుడు మార్చి 5న 9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: తెలంగాణ కోసం కొట్లాడిన నాయకుడు, రాష్ట్రం తెచ్చిన నాయకుడు కేసీఆర్
