రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. 100 రోజులు దగ్గర పడుతున్నా హామీలు నెరవేర్చలేదు.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఇవాళ(గురువారం)హనుమకొండలోని తన నివాసంలో ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన..కాంగ్రెస్ పార్టీ మోసానికి పెట్టింది పేరు. ప్రజలపై భస్మాసుర హస్తం పెట్టడం కాంగ్రెస్ కు అలవాటే. ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించి.. ఈ ఏడాది 4.50 లక్షల ఇండ్లు ఇస్తాం అంటున్నారు. బడ్జెట్ లో రూ. 7740 కోట్లు మాత్రమే కేటాయించింది. 4.50 లక్షల ఇండ్లు కట్టడానికి రూ. 25 వేల కోట్లు కావాలి. ఎన్నికల నోటిఫికేషన్ వస్తే పథకాల ప్రాసెస్ ని నిలిపి వేస్తారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ మోసాల్ని ప్రజలు గమనిస్తున్నారు. BRS హయంలోనే నోటిఫికేషన్లు ఇచ్చాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి వాటర్ మేనేజ్ మెంట్ మీద అవగాహన లేదు. రైతులను నట్టేట ముంచింది. అప్పుల ఊబిలోకి నెట్టి వేస్తోంది. కాంగ్రెస్ హయాంలో రైతుకు భరోసా లేదు. 3ఎకరాల రైతులకు కూడా రైతు బంధు రాలేదు. డిసెంబర్ 9న 2లక్షల రూపాయల రుణ మాఫీ చేస్తామన్నారు ఏమైంది ? వేసవిని దృష్టిలో పెట్టుకుని సమగ్ర ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించాలి. ఆచరణ యోగ్యం కానీ.. ఆర్థిక వనరులకు సాధ్యం కాని హామీలు ఇచ్చారు. ఇచ్చిన హామీలను నెరవేర్చండి. వేసవిలో తాగు నీటి, కరెంట్ సమస్య తీవ్రంగా ఉంటుందన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి.
ఇది కూడా చదవండి: మహబూబ్‌నగర్ వెనుకబాటుతనానికి నాటి టీడీపీ, కాంగ్రెస్ పాలనే
