
హైదరాబాద్‌లోని ఎల్‌గాడాలో విషాదం చోటుచేసుకుంది. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్‌పై నుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌కు చెందిన మారెమ్మ (70 సంవత్సరాలు)గా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే మహిళ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
