ఒకటి నుంచి 9వ తరగతి వరకు నిర్వహించే ఎస్ఏ-2 పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ పరీక్షలను ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఏప్రిల్ 15 నుంచి 22వ తేదీ వరకు ఎస్ఏ-2 పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. 23వ తేదీన ఫలితాలు ప్రకటించి, విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించనున్నారు.
ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. 8వ తరగతికి ఉదయం 9 నుంచి 11:45 గంటల వరకు, 9వ తరగతికి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నట్లు అధికారులు చెప్పారు. ఎస్ఏ-2 పరీక్షల వాయిదాను డీఈవోలు, స్కూళ్ల ప్రిన్సిపల్స్, విద్యార్థులు గమనించాలని అధికారులు సూచించారు.
ఇది కూడా చదవండి: ఎస్‌బీ ఆర్గానిక్స్ ప్రమాద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం