మేడారం మహా జాతరలో ఇవాళ(గురువారం) కీలక ఘట్టం జరిగింది. ఈ సాయంత్రం ముందుగా పూజారులు ఆదివాసి సాంప్రదాయ పద్ధతుల ప్రకారం చిలుకల గుట్ట దగ్గర సమ్మక్కకు పూజలు నిర్వహించారు. ఆ తర్వాత జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ మూడు రౌండ్లు ఫైరింగ్ చేశారు. దీంతో చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి బయలుదేరి గద్దెకు చేరుకోనున్నారు. సమ్మక్కకు స్వాగతం పలుకుతూ దారిపొడవునా అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. సమ్మక్కను ఇవాళ రాత్రి గద్దెలపై ప్రతిష్టించనున్నారు.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్, టీడీపీ హయాంలో అభివృద్ధి జరుగలేదు
