ఢిల్లీ: ఏకలవ్య పాఠశాలల్లో ఉపాధ్యాయుల భారీ నియామకాలు జరుగుతాయని కేంద్రం తెలిపింది. వచ్చే మూడేళ్లలో ఏకలవ్య పాఠశాలల్లో 38,800 మంది ఉపాధ్యాయులను నియమించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.
దేశవ్యాప్తంగా ఉన్న 740 ఏకలవ్య మోడల్ బోర్డింగ్ పాఠశాలల్లో సుమారు 3,50,000 మంది గిరిజన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.
వచ్చే మూడేళ్లలో, 350,000 మంది గిరిజన విద్యార్థులకు సేవలందిస్తున్న 740 ఏకలవ్య మోడల్ బోర్డింగ్ పాఠశాలలకు 38,800 మంది ఉపాధ్యాయులు, సహాయక సిబ్బందిని కేంద్రం నియమించనుంది: ఆర్థిక మంత్రి @nsiharaman #AmritKaal బడ్జెట్ #యూనియన్ బడ్జెట్ 2023 pic.twitter.com/ntI64Voanp
— PIB ఇండియా (@PIB_India) ఫిబ్రవరి 1, 2023
