స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన, మ్యాన్-పోర్టబుల్ యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ (ఎంపీఏటీజీఎమ్) ఆయుధ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించినట్టు భారత సైన్యం ఆదివారం తెలిపింది. డీఆర్‌డీవో రూపొందించిన ఈ వ్యవస్థను ఈ నెల 13న పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్ నుంచి పరీక్షించినట్టు వెల్లడించింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన, మ్యాన్-పోర్టబుల్ యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ (ఎంపీఏటీజీఎమ్) ఆయుధ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించినట్టు భారత సైన్యం ఆదివారం తెలిపింది. డీఆర్‌డీవో రూపొందించిన ఈ వ్యవస్థను ఈ నెల 13న పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్ నుంచి పరీక్షించినట్టు వెల్లడించింది. ఈ క్షిపణి వ్యవస్థ అత్యాధునిక యుద్ధ ట్యాంకులను రాత్రి, పగటి వేళల్లో సమర్థంగా ఎదుర్కొంటుందని సైన్యం తెలిపింది. త్వరలోనే సైన్యం అమ్ముల పొదిలోకి చేరేందుకు ఈ ఆయుధ వ్యవస్థ సిద్ధంగా ఉందని పేర్కొన్నది.