Ravi Shastri: ఐయామ్ హాటీ.. ఐయామ్ నాటీ.. ఐయామ్ సిక్స్టీ అంటూ రవిశాస్త్రి సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్ అవుతోంది. అతను ఏ ఉద్దేశంతో ఆ పోస్టు చేశాడో ఎవరికీ అర్థం కావడం లేదు. బహుశా ఓ యాడ్ కోసం అలా పోస్టు చేసి ఉంటారని భావిస్తున్నారు.

ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్, కోచ్ రవిశాస్త్రి(Ravi Shastri).. తన ఎక్స్ అకౌంట్లో చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఐయామ్ హాటీ, ఐయామ్ నాటీ, ఐయామ్ సిక్స్టీ.. అంటూ ఆ పోస్టుకు క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ ఆ పోస్టు ఏంటో అర్థం చేసుకోలేక కన్ఫ్యూజ్ అవుతున్నారు. ప్రస్తుతం ఐపీఎల్‌కు కామెంట్రీ ఇస్తున్న రవిశాస్త్రీ.. ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన చేసిన ఆ చమత్కారపూరిత పోస్టుపై మాత్రం క్లారిటీ లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ పోస్టు .. బహుశా ఓ యాడ్‌కు చెంది ఉంటుందని అంచనా వేస్తున్నారు. కొత్తగా ఓ యాడ్ కంపెనీతో రవిశాస్త్రి సంతకం చేశారని, బహుశా ఆ కంపెనీ యాడ్ అయి ఉంటుందని కొందరు భావిస్తున్నారు.
I am hottie, I am naughty, I am sixtyyyy
pic.twitter.com/oHBQw3WoIf
— Ravi Shastri (@RaviShastriOfc) April 10, 2024