
తిరుమల: కడప ఒంటిమిట్ట కోదండ రామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన బుధవారం శ్రీ రాముడు శివుని రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. కేరళ డప్పులు, చెక్కభజనలు, కోలాటాలతో భక్త బృందాలు స్వామిని స్తుతిస్తూ ఈసారి మంగళవాయిద్యాల నడుమ స్వామిని ఊరేగిస్తారు.
స్వయంవరంలో శ్రీరాముడు శివుడి ధనుస్సును విరిచి సీతమ్మను పెళ్లాడిన ఘట్టాన్ని శివధనుర్భంగాలంకార స్మరించుకుంటున్నట్లు పురోహితులు చెబుతున్నారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ డైరెక్టర్ ఈవో నటేష్‌బాబు, మాన్యుస్క్రిప్ట్ ప్రాజెక్టు స్పెషలాఫీసర్ విజయలక్ష్మి, ఏఈవో గోపాలరావు, సూపరింటెండెంట్ పి.వెంకటేశయ్య, ఆర్‌సీ సుబ్రహ్మణ్యం, ఆలయ ఇన్‌స్పెక్టర్ ధనంజయ తదితరులు పాల్గొన్నారు.
