మహబూబ్ నగర్ : మటన్ ముక్క ఓ మహిళ ప్రాణాలను బలితీసుకుంది. ఓ ఆలయంలో నిర్వహించిన దావత్లో మటన్ తింటుండగా ఓ మహిళ గొంతులో ముక్క ఇరుక్కుంది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలం ఫతేపూర్ మైసమ్మ ఆలయంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే… నవాబుపేట మండలం కూచూర్ గ్రామానికి చెందిన మంగలి చిన్నమ్మ(60 ఏళ్లు) సమీప బంధువులు… ఫతేపూర్ మైసమ్మ వద్ద బుధవారం దావత్ నిర్వహించారు. దీంతో చిన్నారి ఆ దావత్ వద్దకు వెళ్లింది. భోజనం చేస్తుండగా చిన్నారి గొంతులో మటన్ ముక్క ఇరుక్కుపోయింది. అది బయటకు రాలేదు. లోనికి వెళ్లలేదు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కుటుంబీకులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నట్లు బంధువులు తెలిపారు.
862540