రాజేంద్రనగర్ వద్ద ఓఆర్‌ఆర్‌పై (ORR) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఓఆర్‌ఆర్‌పై వేగంగా దూసుకొచ్చిన కారు హిమాయత్‌సాగర్ (Himayat Sagar) సమీపంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారు ఐదు పల్టీలు కొట్టి పూర్తిగా ధ్వంసమైంది.

హైదరాబాద్: రాజేంద్రనగర్ వద్ద ఓఆర్‌ఆర్‌పై (ORR) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఓఆర్‌ఆర్‌పై వేగంగా దూసుకొచ్చిన కారు హిమాయత్‌సాగర్ (Himayat Sagar) సమీపంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారు ఐదు పల్టీలు కొట్టి పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదం ధాటికి ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తరలించారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని నిర్ధారించారు. కారు ఐదు పల్టీలు కొట్టిందని.. ఈ క్రమంలో ఇద్దరు యువకులు కారులోనుంచి కిందపడి మరణించారని చెప్పారు. ప్రమాద సమయంలో కారు 180 కిలోమీటర్ల స్పీడ్‌తో ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.