ఎమోషన్స్‌ను పండించడంలో రాజమౌళి మాస్టర్. టెక్నికల్‌గా ఆయన సినిమాలు బావుంటాయనే చాలామంది అనుకుంటుంటారు.
ఎమోషన్స్‌ను పండించడంలో రాజమౌళి మాస్టర్. టెక్నికల్‌గా ఆయన సినిమాలు బావుంటాయనే చాలామంది అనుకుంటుంటారు. నిజానికి భావోద్వేగాల ఆవిష్కరణే ఆయన ప్రధాన బలం. ‘స్టూడెంట్ నంబర్ 1’ నుంచి ‘ఆర్‌ఆర్‌ఆర్’ వరకు ఆయన సినిమాలన్నీ భావోద్వేగ ప్రయాణాలే. రానున్న మహేశ్ సినిమా కూడా కథాపరంగా ఉద్వేగపూరితంగానే ఉంటుందని టాక్ నడుస్తున్నది.
దక్షిణాఫ్రికా రచయిత విల్బర్ స్మిత్ రాసిన ఓ నవల ఆధారంగానే ఈ కథను రాయడం జరిగిందని రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ కథ విషయంలో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయని సమాచారం. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే నిధి, నిక్షేపాల వేటగా ఈ సినిమా రూపొందనున్నట్టు బయట టాక్ నడుస్తున్నది.
ఇక మహేశ్ పాత్ర విషయంలో ఆసక్తికరమైన వార్త ఒకటి వెలుగు చూసింది. హనుమంతుడ్ని ప్రేరణగా తీసుకొని రాజమౌళి ఆ పాత్రను డిజైన్ చేశారట. అలాగే మహేశ్ లుక్‌ని కూడా డిఫరెంట్‌గా ప్లాన్ చేశారట. కథాపరంగా ఇందులో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందట. ఆ ఎపిసోడ్ కోసమే మహేశ్‌బాబు గడ్డం పెంచి రగ్గ్‌డ్‌గా మారారని వినికిడి. ప్రీప్రొడక్షన్ వర్క్ పూర్తికావచ్చిన ఈ సినిమాకు సాయిమాధవ్ బుర్రా సంభాషణలు రాస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మిగతా వివరాలు తెలియాల్సివుంది.